- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడ్చల్‌లో డ్రైవింగ్ శిక్షణా కేంద్రానికి కృషి
దిశ ప్రతినిధి, మేడ్చల్: యువతకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో డ్రైవింగ్ శిక్షణ ఇప్పించి, మెరుగైన జీవనాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. బుధవారం బంజారాహిల్స్ మంత్రుల అధికారిక నివాసంలో వినోద్ కుమార్‌తో అశోక్ లేల్యాండ్ డ్రైవింగ్ శిక్షణ విభాగం హెడ్ కల్నల్ మహమ్మద్ అలీ సమావేశమయ్యారు. డ్రైవింగ్ శిక్షణ కేంద్రం కోసం గత కొన్ని రోజుల క్రితం వినోద్ కుమార్ రాసిన లేఖపై అశోక్ లే ల్యాండ్ కంపెనీ స్పందించి తమ ప్రతినిధిగా అలీని పంపించింది.
అత్యాధునిక సాంకేతిక డ్రైవింగ్ శిక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు అలీ అన్నారు. ఈ మేరకు కంపెనీ పంపిన లేఖను వినోద్ కుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. నీటి పారుదల, వ్యవసాయ, రవాణా, సింగరేణి వంటి పలు విభాగాల్లో ఉపయోగించే భారీ సాంకేతిక వాహనాలు నడిపేందుకు కూడా ఈ కేంద్రంలో శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. వీటికి తోడు బీ.ఎస్-6 కొత్త టెక్నాలజీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేలా కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈ కేంద్రంలో శిక్షణ పూర్తి చేసుకున్నవారికి నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ నుంచి సర్టిఫికెట్లు ఇవ్వనున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు.