- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షారుఖ్ కొడుకు కేసు ఓ షెర్లాక్ హోమ్స్ నవల.. ప్రతీక్షణం మలుపులే!
దిశ, సినిమా: షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు, అరెస్ట్.. హాట్ టాపిక్ అయిపోయింది. లైవ్ అప్‌డేట్స్ కోసం జనాలు ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. కాగా, ఆర్యన్ సహా నలుగురు నిందితుల రిమాండ్ రేపటితో ముగుస్తుండగా.. ఈ నెల 11 వరకు కొనసాగించాలని కోర్టును కోరింది ఎన్సీబీ. ఈ సందర్భంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అద్వైత్ సేథ్నా.. ఈ కేసు ప్రతీ క్షణం కొత్త మలుపులు తిరుగుతూ షెర్లాక్ హెమ్స్ నవలను తలపిస్తోందని కోర్టుకు తెలిపారు. ఈ మేరకు కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు అవసరమన్న అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆర్ఎం నెర్లికర్.. 11వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఆర్యన్ ఖాన్ వాట్సాప్ చాట్ నుంచి షాకింగ్ అండ్ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ రికవర్ చేశామని ఎన్సీబీ తెలపగా.. ఆర్యన్‌తోపాటు నిందితుడిగా ఉన్న అర్బాజ్ మర్చెంట్ తండ్రి ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. షిప్‌లోకి వెళ్లాలనేది కూడా లాస్ట్ మినిట్ డెసిషన్ అని, డ్రగ్స్‌కు సంబంధించిన వాట్సాప్ చాట్ అసలు లేనేలేదని ఖచ్చితంగా చెప్పారు.