కోవిడ్‌ చికిత్సకు ఆరోగ్యశ్రీ రేట్లు ఇవే

by srinivas |   ( Updated:2021-05-12 02:49:27.0  )
కోవిడ్‌ చికిత్సకు ఆరోగ్యశ్రీ రేట్లు ఇవే
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా చికిత్సకు చెల్లించే ఆరోగ్యశ్రీ రేట్లను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీపీసీఆర్ టెస్టు లేకపోయినా సీటీ స్కాన్‌లో కొరాడ్స్-4, సివియారిటీ స్కోర్ 25 ఉంటే హాస్పిటల్‌లో చేర్చుకోవాలని తెలిపింది.

ఎన్‌ఏబీహెచ్(నేషనల్ అక్రిడిడేటెడ్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్) గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో నాన్ క్రిటికల్ ట్రీట్‌మెంట్‌కు రూ.4 వేలు, ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు లేని ఆస్పత్రుల్లో నాన్ క్రిటికల్ కేర్‌కు రూ.3,600గా నిర్ణయించింది. ఇక నాన్ క్రిటికల్ విత్ ఆక్సిజన్‌ ట్రీట్ మెంట్‌కు సంబంధించి ఎన్ ఏబీ హెచ్ గుర్తింపు ఉన్న ఆస్పత్రులకు రూ.6,500, ఎన్‌ఏబీహెచ్ గుర్తింపు లేని ఆస్పత్రులకు రూ.5,850గా నిర్ణయించింది.

క్రిటికల్ కేర్ ఐసీయూ చికిత్సకు సంబంధించి గుర్తింపు ఉన్న ఆస్పత్రులకు రూ,12 వేలు, గుర్తింపు లేని ఆస్పత్రులకు రూ.10,800గా నిర్ణయించింది. క్రిటికల్ కేర్ ఐసీయూ విత్ వెంటిలేటర్ చికిత్సకు సంబంధించి రూ.16 వేలు, గుర్తింపు లేని ఆస్పత్రులకు రూ.14,400గా నిర్ణయించింది.

Advertisement

Next Story