- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మాణం పూర్తి
దిశ, ఫీచర్స్ : జమ్మూ కశ్మీర్‌లోని చినాబ్ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. మొత్తం 1,315 మీటర్ల పొడవైన బ్రిడ్జిపై 476 మీటర్ల మేర ఆర్చ్‌ను ఉక్కుతో నిర్మిస్తుండగా.. ఇందుకోసం చినాబ్ నది పైభాగంలో 359 మీటర్ల బెడ్ వేశారు. ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా లింక్ (USBRL) రైల్వే సెక్షన్ ఆధ్వర్యంలో రూ.1,486 కోట్ల వ్యయంతో ఇండియన్ రైల్వేస్ పనులు పూర్తి చేసింది. రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు ఈ ప్రాజెక్టును మరో ఇంజినీరింగ్ మైల్ స్టోన్‌గా పేర్కొనగా.. బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయడం ద్వారా ఇండియా కేపబిలిటీ ప్రపంచానికి తెలుస్తుందని ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడం పట్ల కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆనందం వ్యక్తం చేశారు. ఇక ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ‘జస్ట్ ఇన్‌క్రెడిబుల్.. దీస్ గాయ్స్ ఆర్ రియల్ హీరోస్’ అనే క్యాప్షన్‌తో బ్రిడ్జి మేకింగ్ వీడియో షేర్ చేశాడు.
Just incredible. These guys are real heroes. pic.twitter.com/juPwrJJcwP
— anand mahindra (@anandmahindra) April 5, 2021