- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భక్తులకు ఏపీఎస్ ఆర్టీసీ శుభవార్త

దిశ,వెబ్‌డెస్క్: ఏపీఎస్ ఆర్టీసీలో తిరుమల వెళ్లే భక్తులకు ఆ సంస్థ శుభవార్త చెప్పింది. ప్రతి రోజూ వేయి శీఘ్ర దర్శనం టికెట్లను ప్రయాణీకుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచనుంది. ఈ మేరకు ఆ విషయాన్ని ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్పీ ఠాకూర్ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే దీనికోసం ప్రయాణీకులు బస్సు చార్జీలతో పాటు రూ. 300లను చెల్లించాలని అన్నారు. కాగా ఈ శీఘ్రదర్శనం టికెట్లను తీసుకున్న వారి కోసం ప్రతి రోజూ ఉదయం 11 గంటలకు, సాయంత్రం 4 గంటలకు దర్శనం కల్పించనున్నట్టు పేర్కొన్నారు.
ఈ టికెట్లు తీసుకున్న భక్తులు తిరుమల చేరుకోగానే శీఘ్ర దర్శనం చేసుకునేందుకు వారికి ఆర్టీసీ సూపర్ వైజర్లు సహాయ సహకారాలు అందిస్తారని వెల్లడించారు. తిరుపతి వెళ్లే ప్రయాణీకులకు దర్శనం విషయంలో ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఆర్టీసీ బస్సుల్లో శీఘ్రదర్శనం టికెట్టు సదుపాయాన్ని కలిపించామని..ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.