గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

by Harish |
గురుకులాల్లో ప్రవేశాలకు ఆహ్వానం
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో జనరల్, వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మార్చి 4న నిర్వహించే పరీక్షలకు దరఖాస్తులను ఈ నెల 28 లోపు సమర్పించాలని తెలిపారు. రెగ్యులర్ ప్రాతిపదికన 2020-21 విద్యా సంవత్సరంలో సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ ద్వారా 10వ తరగతి లేదా పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు www.tswreis.in లేదా www.tswreisjc.cgg.gov.in, దగ్గరలోని గురుకుల, జూనియర్ కళాశాలల్లో సంప్రదించొచ్చని తెలిపారు.

Next Story

Most Viewed