ఆస్ట్రేలియాలో టిక్ టాక్ బ్యాన్

by vinod kumar |   ( Updated:2020-07-09 07:59:39.0  )
ఆస్ట్రేలియాలో టిక్ టాక్ బ్యాన్
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, చైనా సరిహద్దు వివాదం మూలంగా ఇప్పటికే ఇండియాలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇండియా బాటలోనే ఆస్ట్రేలియన్లు కూడా పయనిస్తున్నట్టు తెలుస్తోంది. టిక్‌ టాక్‌తో డేటా చోరీ ముప్పుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తూ ఆస్ట్రేలియా అసెంబ్లీ ఎమ్మెల్యేలు టిక్‌ టాక్‌ను నిషేధించాలని ప్రతిపాదిస్తున్నారు.

టిక్‌ టాక్‌ను చైనా ప్రభుత్వం వాడుకుంటున్నదని, దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. లిబరల్ సెనేటర్ జిమ్ మోలన్. విదేశీ జోక్యంపై సోషల్ మీడియా ద్వారా సెలెక్ట్ కమిటీని ఎదుర్కోవాలని టిక్‌ టాక్ ప్రతినిధులను లేబర్ సెనేటర్ జెన్నీ మెక్‌ అలిస్టర్ డిమాండ్‌ చేసినట్టు సమాచారం. టిక్‌ టాక్‌పై వస్తున్న ఆరోపణలను దాని యజమాని బైట్‌డాన్స్‌ ఖండిస్తూనే ఉన్నారు. టిక్‌టాక్‌ డేటా అంతా యూఎస్‌, సింగపూర్‌లోని సర్వర్లలో స్టోర్‌ అవుతుందని తెలిపారు.

Advertisement

Next Story