అపోలో టైర్స్ నికర నష్టం రూ. 139 కోట్లు

by Harish |
అపోలో టైర్స్ నికర నష్టం రూ. 139 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద టైర్ తయారీ సంస్థల్లో ఒకటైన్ అపోలో టైర్స్ లిమిటెడ్ 2020-21 ఆర్థిక సంవత్సరానికి తొలి త్రైమాసికంలో రూ. 134.58 కోట్ల నికర నష్టాలను వెల్లడించింది. కొవిడ్-19 వ్యాప్తి కారణంగా భారత్, యూరోపియన్ మార్కెట్లలో ఉత్పత్తి, డిమాండ్ తగ్గినందున కంపెనీ నష్టాలను నమోదు చేసినట్టు తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 141.6 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ తక్కువ పన్ను చెల్లింపులు జరిపినందున నష్టాలు పరిమితంగానే ఉన్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. పలు ప్రాంతాల్లో వాహనాలకు డిమాండ్ ఉన్నందున తొలి త్రైమాసికంలో కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 33.65 శాతం తగ్గి రూ. 2,873.41 కోట్లకు చేరుకుంది.

కొవిడ్-19 వ్యాప్తి వల్ల లాక్‌డౌన్ తర్వాత కూడా కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి దీంతో తయారీదారులు, విడి భాగాల సరఫరాదారులు కర్మాగారాలను మూసేయాల్సి వచ్చింది. దీంతో అపోలో టైర్స్ పాక్షికంగా చాలా ప్రాంతాల్లో కర్మాగారాలను మూసేయాల్సి వచ్చిందని అపోలో టైర్స్ ఛైర్మన్ ఓంకార్ తెలిపారు.

Advertisement

Next Story