- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రైవేశాలకు సంబంధించి ఈఏపీసెట్ పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. విజయవాడలో ఉదయం 10.30 గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఇంజినీరింగ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు. మొదటి విడత కౌన్సెలింగ్ ఈనెల 18నుంచి చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులకు గతంలో ఎంసెట్ నిర్వహించేవారు. అయితే మెడికల్ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నీట్ నిర్వహిస్తుండటంతో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి తొలగించారు. దీంతో ఏపీ ఎంసెట్‌ను ఏపీ ఈఏపీసెట్(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)గా మార్చారు. ఈఏపీ సెట్ –2021 పేరుతో పరీక్షలు సైతం నిర్వహించారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు సంబంధించి ఆగస్టులో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.