- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముహూర్తం ఓకే… 22న మంత్రివర్గ విస్తరణ!
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ జూలై 22న జరగనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఖాళీ అయిన ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణల స్థానాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఆ సామాజిక వర్గాలకు చెందిన ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులకు మంత్రి వర్గంలో స్థానంలో కల్పించనున్నారంటూ ఊహాగానాలు చెలరేగినప్పటికీ…తాజాగా గత మంత్రుల సామాజిక వర్గానికి చెందిన వారినే మంత్రులను చేసేందుకు సీఎం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో పిల్లి సుభాష్ చంద్రబాస్ స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణు, మోపిదేవి వెంకటరమణ స్థానంలో శ్రీకాకుళం జిల్లా, పలాస ఎమ్మెల్యే అప్పల రాజుకు కేబినెట్‌లో చోటు కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీరి శాఖలు మాత్రం మారుతాయని, జులై 22న వీరు మంత్రి వర్గంలో చేరుతారని సమాచారం.