రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారుల దాడులు

by srinivas |
రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ అధికారుల దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు చేస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం శ్రీ‌కాకుళం జెడ్పీ కార్యాల‌యంలోని పంచాయితీ రాజ్ ఇంజ‌నీరింగ్ విభాగం ఈఈ కార్యాల‌యంలో ప‌లు రికార్డులు పరిశీలించారు. ఇటీవ‌ల బిల్లు చెల్లింపులు, గ్రామ‌స‌చివాల‌య ప‌నుల‌కు సంబంధించిన ఎం.బుక్‌లు, బిల్లు చెల్లింపులను, వాస్త‌వ ప‌నుల‌తో స‌రిపోల్చుతున్నారు. మ‌రో వైపు ఆమ‌దాల‌వ‌ల‌స రోడ్లు, భ‌వ‌నాల శాఖ డీఈ కార్యాల‌యంలో కూడా సోదాలు జ‌రుగుతున్నాయి. గ‌త రెండేళ్ల కాలంలో జ‌రిగిన ప‌నులు, బిల్లు చెల్లింపులకు సంబంధించిన రికార్డుల‌ను త‌నిఖీ చేస్తున్నారు.

అదేవిధంగా నెల్లూరు నగరంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పలు విభాగాలలో సోదాలు నిర్వహించి రికార్డులను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా ఆత్మకూరులోని రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు. రికార్డుల పరిశీలన అనంతరం వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు విశాఖ పట్నం జిల్లాలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్‌లోని జాయింట్ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్ ఫ్యాక్టరీస్‌పై దాడులు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed