- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
చంద్రబాబు వస్తే అభ్యంతరం లేదు: సుచరిత
by srinivas |

X
దిశ, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన విషయంలో వైసీపీ ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని రాష్ట్ర హోంశాఖా మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ రాసినట్టు చెబుతున్న నేపథ్యంలో మంత్రి పైవిధంగా స్పందించారు. చంద్రబాబు ఏపీ డీజీపీకి లేఖ ఎప్పుడు రాశారు? డీజీపీకి లేఖ రాసినప్పుడు తగిన ఆధారాలను చూపించాల్సి ఉంటుందని హోంమంత్రి స్పష్టం చేశారు. ఏపీలో దరఖాస్తు చేయకుండా కేంద్రానికి లేఖ రాశారని హోంమంత్రి ప్రస్తావించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌లు విశాఖ బాధితులను పరామర్శించారు. వారినెవరూ అడ్డుకోలేదని మంత్రి గుర్తు చేశారు. దరఖాస్తు చేసుకుంటే అనుమతి తప్పనిసరిగా ఇస్తాం. అందులో ఎలాంటి వివాదం లేదని మంత్రి సుచరిత పేర్కొన్నారు.
Next Story