పితాని కుమారుడికి షాకిచ్చిన హైకోర్టు

by srinivas |
పితాని కుమారుడికి షాకిచ్చిన హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సంచలనం రేపుతున్న ఈఎస్‌ఐ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పితాని కుమారుడు వెంకట సురేశ్‌పై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. తనకు ముందస్తు బెయిల్ ఇప్పించాలని ఆయన కోర్టుకెక్కాడు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే మందుల కొనుగోళ్లలో అక్రమాలు చేశారని.. పితాని మాజీ పీఎస్ మురళీని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో పితాని కుమారుడి హస్తం ఉందన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు అతడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story