‘వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌’ కు కొత్త కమిటీ..

by srinivas |   ( Updated:2021-09-24 06:31:31.0  )
ap-govt
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే వన్ టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకానికి జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంగా పేరు మారుస్తూ జగన్ సర్కార్ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పేదల గృహ రుణాలకు సంబంధించిన ఈ పథకం అమలుకు సంబంధించి మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీకి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కన్వీనర్‌గా ప్రభుత్వం నియమించింది. అయితే డిప్యూటీ సీఎం(రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజులను సభ్యులుగా నియమించింది. ఈ మేరకు సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీ కనీసం వారానికి ఒకసారి ఈ పథకంపై సమీక్షించాల్సి ఉంటుంది. సమీక్షలో చర్చించిన అంశాలు.. తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించి ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తోందని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed