ఆర్.నారాయణ మూర్తిని అభినందించిన ఏపీ రైతులు.. ఎందుకంటే?

by srinivas |
R. Narayana Murthy
X

దిశ, ఏపీ బ్యూరో: సినీనటుడు ఆర్.నారాయణ మూర్తిని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి సభ్యులు అభినందించారు. రైతు ఉద్యమానికి మద్దతుగా “రైతన్న” సినిమా నిర్మించినందుకు రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈ సినిమాలో కౌలు రైతులతో సహా యావత్ రైతాంగం క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను చక్కగా చూపించారని కొనియాడారు. అలాగే కేంద్రం తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలు, విద్యుత్ బిల్లు 2020, స్వామినాథన్ కమిషన్ సూచించినట్లు మద్దతు ధర ఇవ్వకపోవడం వంటి అంశాలపై కూడా ఈ మూవీలో చర్చించారని తెలిపారు. రైతులు ఎదుర్కొంటున్న దుస్థితిని సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న లక్షలాదిమంది రైతన్నల ఉద్యమానికి మద్దతుగా నిలుస్తుందని కొనియాడారు.

Advertisement

Next Story

Most Viewed