- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
10వేల మార్క్ క్రాస్.. ఏపీలో గంటకు 437, నిమిషానికి 7 కేసులు
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా సెకండ్ వేవ్ తొలిదశలో నమోదైన కేసులను బీట్ చేసే దిశగా దూసుకుపోతున్నాయి. తాజాగా వెలువడిన హెల్త్ బులెటిన్ ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో 10,759 కొత్త కేసులు నమోదు కాగా, 31మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. జిల్లాల వారీగా చూసుకుంటే చిత్తూరు 1474, కర్నూలు 1367, శ్రీకాకుళం 1336 , గుంటూరు 1186, తూర్పుగోదావరి 992, విశాఖ 844, నెల్లూరు 816, అనంతపురం 789, కృష్ణా 679, ప్రకాశం 345, విజయనగరం 562, కడప 279, పశ్చిమగోదావరి 90 కేసులు వెలుగుచూశాయి.
ఇదిలాఉండగా, చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఐదుగురు చొప్పున మృతి చెందగా.. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో ముగ్గురు చొప్పున.. తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరంలో ఇద్దరు చొప్పున.. అనంతపురం, కడప, విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ పేర్కొంది. తాజా కేసులు కలిపి ఏపీలో మొత్తం9,94,567 కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసులు 66,944, మొత్తం మరణాలు 7,541కి చేరుకున్నాయి. గత సెప్టెంబర్‌లో ఏపీలో అత్యధికంగా 10,771 కేసులు నమోదయ్యాయి.ఫస్ట్ వేవ్‌లో 10వేల కేసులు దాటడానికి 7నెలల సమయం పడితే, సెకండ్ వేవ్‌లో నెల రోజులకే 10వేల కేసులు దాటాయి. ప్రస్తుతం గంటకు 437, నిమిషానికి 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.