- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీఎంఆర్ అనుమతిచ్చింది..కరోనా పరీక్షల సంఖ్య పెంచండి: జగన్
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైద్యఆరోగ్యశాఖాధికారులకు సూచించారు. నిన్న ఒక్కరోజే 6,520 ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశామన్న జగన్, రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 48,034 పరీక్షలు చేశామని అన్నారు. ఇది వైద్యశాఖ నిబద్దతకి నిదర్శనమని ఆయన కొనియాడారు.
కొరియా నుంచి తెప్పించిన కరోనా ర్యాపిడ్ టెస్ట్ కిట్లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఐసీఎంఆర్ నిర్దేశించిన ప్రొటోకాల్ ప్రకారం ర్యాపిడ్ టెస్టు కిట్లతో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ప్రభుత్వం తెప్పించిన ర్యాపిడ్ టెస్టు కిట్లతో ఇప్పటి వరకూ 14,423 పరీక్షలు చేశామని చెప్పారు. అయితే కరోనా పరీక్షలు బాగానే జరుగుతున్నప్పటికీ వీటి సంఖ్య మరింత పెంచాలని ఆయన ఆకాంక్షించారు.
కరోనా పరీక్షలు నిర్వహించే విషయంలో వెనకడుగు వేయొద్దని ఆయన అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలు ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి సత్వరమే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడం ద్వారా వారికి సరైన చికిత్స అందించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
tags:corona virus, covid-19, ap, rapid test kits, ap cm