సీఎం జగన్ విదేశీయాత్ర..స్పెషల్ ఏంటంటే

by srinivas |
jagan-tour
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈనెలాఖరున విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సమీక్షలు..పాలనా వ్యవహారాలు..పార్టీలోని అంశాలతో నిత్యం బిజీబిజీగా గడుపుతున్న సీఎం జగన్, ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి విదేశాల్లో గడపాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 26న సీఎం జగన్ దంపతులు లండన్, ప్యారిస్‌లలో పర్యటించనున్నారు. 4రోజులు అక్కడే బస చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జగన్ తన కుమార్తెను కాలేజీలో చేర్చటం కోసం అమెరికా పర్యటనకు వెళ్లారు.

అక్కడ టైం స్క్వేర్ లో ప్రవాసాంధ్రులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పాలనలో పూర్తిగా నిమగ్నమయ్యారు. సమీక్షలు..పర్యటనలతో బిజీబిజీగా గడిపారు. తాజాగా ఇప్పుడు కుటుంబంతో కలిసి విదేశీ యాత్రకు వెళ్లాలని నిర్ణయించారు. ఇకపోతే ఈ నెల 28న జగన్-భారతిల వివాహ వార్షికోత్సవం. ఈ ఏడాదితో వారి వివాహం జరిగి 25 ఏళ్లు అవుతోంది. 1996 ఆగస్టు 28న జగన్ – భారతి వివాహం జరిగింది. దీంతో ఈ ఏడాది ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో గడపాలని విదేశీ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తిరిగి ఈనెల 29న తాడేపల్లి చేరుకోనున్నట్లు తెలుస్తోంది.

జగన్ కుమార్తెలు హర్షారెడ్డి, వర్షారెడ్డిలు ఇద్దరూ విదేశాల్లోనే ఉన్నారు. ప్రపంచంలోనే టాప్ 5 బిజినెస్ స్కూల్స్‌లో ఒకటైన పారీస్ ఇన్సీడ్ బిజినెస్ స్కూల్‌లో హర్షారెడ్డి చదువుతుండగా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో వర్షారెడ్డి విద్యనభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ దంపతులు ఈ ఐదు రోజులపాటు కుమార్తెలతో కలిసి తమ పెళ్లి రోజు వేడుకలను జరుపుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed