- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ సీఎంకు కేంద్రమంత్రి హామీ
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. బుధవారం ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ను జగన్ కలిశారు. ఈ భేటీలో సీఎం జగన్ తోపాటు వైసీపీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి కూడా ఉన్నారు.
2021 డిసెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు విడుదల చేయాలని షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు అందించాలని కోరారు జగన్. పోలవరం ప్రాజెక్ట్ పర్యటకు రావాలని జలశక్తి మంత్రిని సీఎం జగన్ కోరగా, వస్తానని ఆయన హామీ ఇచ్చారు.
అంతేకాకుండా గోదావరి-కావేరి నధుల అనుసంధానంపైన కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. నదుల అనుసంధానం అంశంపై రాష్ట్ర పర్యటనకు వెళ్లాలని టాస్క్‌ఫోర్స్ చైర్మన్ వేదిరే శ్రీరామ్‌కు జలశక్తి మంత్రి షెకావత్ సూచించారు.