నగరి ఎమ్మెల్యే రోజాకు ఊరట.. జగన్ కీలక నిర్ణయం

by srinivas |
నగరి ఎమ్మెల్యే రోజాకు ఊరట.. జగన్ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు నగరి ఎమ్మెల్యే రోజా దుకుడు చూస్తే, అందరితో పాటు రోజా కూడా వైసీపీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఖాయం అని భావించారు. కానీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ, సీఎం జగన్ రోజాను ఎమ్మెల్యేగానే ఉంచారు. కాగా ఇటీవల ఏపీఐఐసీ చైర్ పర్సన్ పోస్టుతో సరిపెట్టారు. దీంతో ఆమె కూడా మంత్రి పదవి కోసం ఎదరుచూసి, కాస్త నిరాశా చెందింది. అయితే ప్రస్తుతం ఆమె నగరి పాలిటిక్స్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. తన రియాల్టీ షో కమిట్‌మెంట్స్‌ను చూసుకుంటూనే… ఏ మాత్రం సమయం దొరికినా వెంటనే నగరిలో వాలిపోతున్నారు. అయితే రోజాకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఏపీఐఐసీ చైర్‌పర్సన్ పదవిపై చాలాకాలం నుంచి ఓ అపవాదు ఉంది. ఈ కార్పొరేషన్‌కు నిధులు లేవని, అందుకే రోజా చేపట్టిన బాధ్యతలకు పెద్దగా ప్రాధాన్యత లేదనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో బుధవారం ఏపీ మంత్రిమండలి సమావేశంలో సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం రోజాకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ ప్రభుత్వం, ఏపీఐఐసీ కార్పొరేషన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2వేల కోట్ల రుణం తెచ్చుకునేందుకు ఏపీఐఐసీకి ఏపీ మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. ఈ రుణానికి ఏపీ ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ ఓకే చెప్పింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపీఐఐసీ మరింత క్రియాశీలకంగా మారనుంది.

Advertisement

Next Story

Most Viewed