- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చిరంజీవితో కలిసి పనిచేస్తాం.. సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ… రాబోయే ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమికి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఇస్తామని తెలిపినట్టు ప్రకటించారు. చిరంజీవితో కలిసి పనిచేస్తామని వీర్రాజు స్పష్టం చేశారు. అంతేగాకుండా వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీజేపీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, వైసీపీ పార్టీల్లో తమకు ఎవరు పోటీ ఇస్తారో చూస్తాం అని సవాల్ విసిరారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు కావడం మంచిదే కానీ.. పేపర్ ప్రకటనలు, బెదిరింపు ధోరణులు మంచిది కాదని అన్నారు.
Next Story