- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈనెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నెల18 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మెుత్తం వారం రోజులపాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల18, 19 తేదిలలో రెండు రోజులు సభను నిర్వహించాలని నిర్ణయించింది. ఆ తర్వాత 20, 21 శని, ఆది వారాలు రావడంతో ఆయా దినాలను సెలవు దినాలుగా ప్రకటించి తిరిగి 22 నుంచి అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించనుంది. వరుసగా ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ తేదీలపై పూర్తి స్పష్టత ఈ నెల 18న జరిగే బీఏసీ సమావేశంలో రానుంది.
ఇకపోతే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఇరుకునపెట్టేందుకు సన్నద్ధమవుతుంది. మరోవైపు ప్రతిపక్ష టీడీపీ సైతం ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు, ఎయిడెడ్ విద్యాసంస్థల ప్రైవేటీకరణ, అప్పులు, అమ్మఒడి పథకంలో సంస్కరణలు వంటి పలు అంశాలపై చర్చించేందుకు పట్టుబట్టనున్నట్లు తెలుస్తోంది.