- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహిళా క్రికెటర్ అరుదైన రికార్డు..
దిశ, వెబ్‌డెస్క్ : భారత సంతతి మహిళా క్రికెటర్(women cricketer) అంతర్జాతీయ టీ20 (International t20)లో అద్భుతమైన రికార్డును నెలకొల్పింది. జర్మనీ (jermany) విమెన్స్ టీమ్ కెప్టెన్ అనురాధ దొడ్డ బళ్ళాపూర్ శుక్రవారం ఆస్ట్రియా (austriya)తో జరిగిన టీ20 మ్యాచ్‌లో వరుసగా నాలుగు బంతుల్లో 4 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది.ఈ ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా అనురాధ(Anuradha) చరిత్ర సృష్టించింది.
199 పరుగుల భారీ లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఆస్ట్రియాను 33 ఏళ్ల అనురాధ బెంబేలేత్తించింది. తన అద్భుతమైన బౌలింగ్‌తో ఆస్ట్రియాను తక్కువ స్కోర్ (Low score)కే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లో అనురాధ కేవలం ఒక్క పరుగు (Single run) మాత్రమే సమర్పించుకుని ఓవరాల్‌గా ఐదు వికెట్లు పడగొట్టింది. లక్ష్య చేధనలో ఆస్ట్రియా 20 ఓవర్లలో 61/9 స్కోర్ చేయగలిగింది. దానితో జర్మనీ 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.