నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: TSPSC నుంచి మరో నోటిఫికేషన్

by GSrikanth |   ( Updated:2022-09-03 15:12:00.0  )
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: TSPSC నుంచి మరో నోటిఫికేషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్​ పోస్టులను భర్తీ చేసేందుకు టీఎస్​ పీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఒక నోటిఫికేషన్​ విడుదల చేసి.. గతంలో ఇచ్చిన రవాణా శాఖ అసిస్టెంట్​ మోటారు వెహికిల్​ ఇన్స్​ పెక్టర్​ నోటిఫికేషన్​ ను విత్​ డ్రా చేసింది. నిబంధనలను సడలింపు కారణంగా ఈ నోటిఫికేషన్​ విత్​ డ్రాచేస్తున్నామని, తర్వలో మరో నోటిఫికేషన్​ జారీ చేస్తామని టీఎస్​ పీఎస్సీ సెక్రెటరీ అనితా రామచంద్రన్​ వెల్లడించారు.

1540 ఏఈఈ పోస్టులు

వివిధ విభాగాల్లో 1540 ఏఈఈ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన కమిషన్ సమావేశంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టుల నోటిఫికేషన్‌ను ఆమోదించారు. దీంతో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ ఇచ్చారు. ఖాళీల వివరాలకు వస్తే... మిషన్ భగీరథ విభాగంలో 302, పీఆర్ అండ్ ఆర్ డీ ( సివిల్) విభాగంలో 211, ఎమ్ఏ అండ్ యూడీలో 147, టీడబ్ల్యూ లో 15, ఐ అండ్ కాడ్ లో 704, సివిల్ ఇంజనీరింగ్ లో 320, మెకానికల్ లో 84, ఎలక్ట్రికల్ లో 200, అగ్రికల్చర్ లో 100 జీడబ్ల్యూలో 3, టీఆర్ అండ్ బీ విభాగం (సివిల్) లో 145, టీఆర్ అండ్ బీ విభాగం (ఎలక్ట్రికల్) లో 13 పోస్టులు ఉన్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ నెల 22 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా... వచ్చే నెల 14న దరఖాస్తులకు తుది గడువు విధించారు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్ సైట్ లో లాగిన్ కావొచ్చు. ఓటీఆర్​ లో నమోదైన అభ్యర్థులకే అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంటోంది.

113 పోస్టుల నోటిఫికేషన్​ క్యాన్సిల్​

రవాణా శాఖలో 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులకు జూలై 28న విడుదల చేసిన నోటిఫికేషన్​ ను టీఎస్​ పీఎస్సీ విత్​ డ్రా చేసుకుంది. 54 పోస్టులు మల్టీ జోన్‌-1లో, 59 పోస్టులు మల్టీ జోన్‌-2 పరిధిలో ఉన్నాయి. ఈ పోస్టులకు ఈ నెల 5 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు నెల రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించాల్సి ఉంది. అయితే, ఇందులో ప్రధానంగా మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ/ డిప్లొమా (ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణతతో పాటు వాలిడ్‌ హెవీ మోటార్‌ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలని నిబంధన పెట్టారు. ఈ పోస్టుల్లో దాదాపు 60 పోస్టుల వరకు మహిళలకు కేటాయించారు. దీంతో మహిళలకు హెవీ మోటారు డ్రైవింగ్​ లైసెన్స్​ లేదని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చాయి. దీనిపై పరిశీలించిన టీఎస్​ పీఎస్సీ పాలకవర్గం పాత నోటిఫికేషన్​ లో విధించిన నిబంధనలను సడలించేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్​ ను విత్​ డ్రా చేసుకున్నట్లు ప్రకటించింది. కొత్తగా త్వరలోనే ఏఎంవీఐ పోస్టులకు మరో నోటిఫికేషన్​ వస్తుందని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed