- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేరళలో మరో 13 ‘జికా’ కేసులు
తిరువనంతపురం: కేరళలో తొలిసారి జికా వైరస్ కేసు నమోదైన తర్వాతి రోజే మరో 13 కేసులు కన్ఫమ్ అయ్యాయి. అన్ని కేసులు తిరువనంతపురం జిల్లాలోనే రిపోర్ట్ అయ్యాయి. పరస్సాలకు చెందిన 24ఏళ్ల గర్భిణీలో గురువారం జికా వైరస్ ఉన్నట్టు తేలిన సంగతి తెలిసిందే. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం తమిళనాడు సరిహద్దులోనే ఆమె గ్రామానికి సర్వెలెన్స్ టీమ్‌ను పంపింది. దోమల నివారణకు చర్యలు చేపట్టింది. అలాగే, మరో 13 నమూనాలను జికా వైరస్ నిర్ధారణ కోసం పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపింది.
అన్ని కేసులు జికా పాజిటివ్‌గానే నిర్ధారణ అయ్యాయి. ఇందులో ఎక్కువ మంది హెల్త్‌వర్కర్లే ఉండటం గమనార్హం. ఎయిడెస్ దోమతో వ్యాపించే ఈ వైరస్ కట్టడికి రాష్ట్రానికి తోడుగా, నివారణ చర్యల రూపకల్పనకు ఆరుగురు సభ్యుల కేంద్ర బృందాన్ని కేరళకు పంపినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఆరోగ్య నిపుణులు, అంటువ్యాధుల నిపుణులు ఇందులో భాగంగా ఉన్నారు. కరోనా కేసులతో సతమతమవుతున్న కేరళకు జికా వైరస్ మరో సవాల్ విసురుతున్నది.