ఆశా వర్కర్ల సాహసం.. వాగు దాటి వ్యాక్సినేషన్

by Shyam |
ANM activists
X

దిశ, నెక్కొండ: మహబూబాబాద్ జిల్లా నెక్కొండ మండలంలోని అలంఖానిపేట ప్రాథమిక వైద్యశాల పరిధిలోని నక్కలగుట్టతండ గ్రామ ఆశా వర్కర్లు వ్యాక్సిన్ వేయడం కోసం తిప్పలు పడ్డారు. వ్యాక్సిన్ వేసేందుకు ఎద్దుల బండి మీద వాగును దాటేందుకు ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఆదివారం సాహసించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏఎన్ఎం పద్మ, ఆశా వర్కర్లు అరుణ, కవిత, కళ్యాణిలు ఎద్దులబండి ద్వారా నక్కలగుట్ట తండాకు చేరుకొని కరోనా వ్యాక్సిన్ వేశారు.

నక్కలగుట్ట తండాకు చెందిన ప్రజలు వైద్య సేవల కోసం తరచూ నాగారం సెంటర్‌కు రావాల్సి వస్తోందని, వాగు దాటడానికి ఎడ్లబంది ఒక్కటే ఆధారమని తెలిపారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గతంలో ప్రకటనలు చేసినా.. ఇంతవరకు ఒక్క అడుగుకూడా ముందుకు పడలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాగారం-నక్కలగుట్టతండాల మధ్య వంతెన నిర్మించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed