- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులు తీసుకోనున్న మరో స్టార్ సినీ జంట.. ఆ హీరోయిన్ వల్లే..?
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం విడాకుల ట్రెండ్ నడుస్తోంది. ఎంత తక్కువ సమయంలో డేటింగ్ చేసి, వివాహం చేసుకుంటున్నారో అంతే తక్కువ సమయంలో విడాకులు కూడా తీసుకుంటున్నారు. ఇటీవల టాలీవుడ్‌కి చెందిన సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకొని అందిరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా బాలీవుడ్‌కు చెందిన అనిల్ కపూర్, సునీత దంపతులు విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరు 11 ఏళ్ల పాటు డేటింగ్ చేసి.. 1984 లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమ కథ కూడ ఒక సినిమా స్టోరిని తలపిస్తుంది. అయితే తాజాగా.. అనిల్ కపూర్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయిన కరణ్ జోహర్ ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్నాడు. అనిల్ కపూర్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, సంజయ్ దత్ పాల్గొన్నారు. వీరిని కరణ్ ర్యాపిడ్ రౌండ్‌లో కొన్ని ప్రశ్నలు అడిగాడు. దానిలో భాగంగా అనిల్ కపూర్‌ను ఒకవేళ తన భార్య సునీతతో విడిపోతే వేరే ఏ మహిళతో ఉంటారని అడిగాడు. దీనికి అనిల్ సమాధానంగా పక్కనే ఉన్న కంగనా వైపు సైగ చేసి ఆమె పేరు చెప్పాడు. దీంతో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ సిగ్గుపడింది. ఇది కేవలం ఫన్నీగా మాత్రమే జరిగింది. అంతే కాకుండా అనిల్ కపూర్ ఈ షో వేదికగా తమపై వస్తున్న రూమర్లపై స్పందించాడు. మేం విడిపోతున్నాం అనే వార్తలు అన్ని అవాస్తవం అని తెలిపాడు. తమ వివాహ బంధంపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టాడు.