- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రాజస్థాన్‌కు మరో షాక్.. ఐపీఎల్ నుంచి ఆండ్రూ టై అవుట్

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ ఆండ్రూ టై ఈ సీజన్‌కు దూరమయ్యాడు. సీజన్ ప్రారంభం నుంచి జట్టుతో ఉన్న ఆండ్రూ టై వ్యక్తిగత కారణాల వల్ల ఆదివారం ఆస్ట్రేలియా తిరిగి వెళ్లినట్లు రాజస్థాన్ యాజమాన్యం తెలిపింది. ‘ఆండ్రూ టై వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. అతడికి కావలసిన సహాయాన్ని యాజమాన్యం అందిస్తున్నది. అతడితో జట్టు మొత్తం ఉన్నది’ అని రాజస్థాన్ ట్వీట్ చేసింది.
కాగా టై వెళ్లడానికి అసలు కారణం మాత్రం వెల్లడించలేదు. కాగా, ఈ సీజన్‌లో రాజస్థాన్ జట్టును వీడిన 4వ విదేశీ క్రికెటర్ ఆండ్రూ టై. అంతకు ముందు జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ గాయం కారణంగా దూరమవగా.. లియామ్ లివింగ్‌స్టన్ బయోబబుల్‌లో ఉండలేక ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిపోయాడు. ప్రస్తుతం జట్టులో నలుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే ఉన్నారు. జాస్ బట్లర్, క్రిస్ మోరిస్, డేవిడ్ మిల్లర్, ముస్తఫిజుర్ రెహ్మాన్ మాత్రమే మిగిలారు. ఆండ్రూ టై స్వదేశం వెళ్లిపోయినట్లు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ సంగక్కర కూడా దృవీకరించారు.