Kadapa: ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ అత్యుత్సాహం

by srinivas |   ( Updated:2023-05-19 16:00:29.0  )
Kadapa: ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ అత్యుత్సాహం
X

దిశ, కడప: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వైసీపీ కడప పార్లమెంట్ అధ్యక్షుడు కొత్తమద్ది సురేష్ బాబు అన్నారు. శుక్రవారం సీబీఐ విచారణకు హాజరుకావాలని హైదరాబాద్ వెళ్లిన ఎంపీ అవినాష్ రెడ్డి తన తల్లికి ఆరోగ్యం బాగాలేదన్న కారణంగా తనకు మరికొంత సమయాన్ని ఇవ్వాలని సీబీఐని అడిగారన్నారు. సీబీఐ ఒక కోణంలోనే విచారణ చేస్తోందని సురేష్ బాబు అన్నారు. వివేకా హత్య కేసులో మొదట కాల్ చేసిన సూర్య ప్రకాష్‌ను సీబీఐ విచారించాలన్నారు. సీబీఐ ఒకరికి తొత్తులాగా పని చేస్తుందన్నారు. హైదరాబాద్ నుంచి కర్నూల్ వరకు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు వెంబడించడం ఏమిటని ప్రశ్నించారు. సీబీఐ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఏబీఎన్, మహాటీవీలు దూకుడు తగ్గించాలని హితవు పలికారు. ఎంపీ కాన్వాయ్‌ను వెంబడించడం మీడియాకు తగదన్నారు. మీడియా సమన్వయం పాటించాలని సురేష్ బాబు సూచించారు.

ఇవి కూడా చదవండి : Viveka Case: అవినాశ్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం

Advertisement

Next Story