Breaking: అన్నమయ్య జిల్లాలో 250 మంది విద్యార్థులకు కళ్ల కలకలు

by srinivas |   ( Updated:2023-09-25 16:07:51.0  )
Breaking: అన్నమయ్య జిల్లాలో 250 మంది విద్యార్థులకు కళ్ల కలకలు
X

దిశ, వెబ్ డెస్క్: అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో కళ్ల కలకలు కలకలం రేపాయి. ఇందిరమ్మకాలనీ పాఠశాలలో 250 మంది విద్యార్థులకు కళ్లు కలిగాయి. కళ్లు మంటలు, నీరుకావడం, దురుద, నొప్పులు వంటి లక్షణాలతో విద్యార్థులు బాధపడుతున్నారు. బాధితులంతా 6 తరగతి నుంచి పదో తరగతి మధ్య చదివే విద్యార్థులుగా గుర్తించారు. విషయం తెలుసుకున్న వైద్యులు గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఐ డ్రాప్స్ వేస్తూ కంటి మందులు ఇస్తున్నారు. మరో రెండు రోజుల్లో విద్యార్థులకు కళ్ల కలకలు తగ్గిపోతాయని వైద్యులు చెబుతున్నారు. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

ఇక కళ్లకలకలు వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఫారాసైట్ల పీడనం, అలర్జీల వల్ల వస్తుందని వైద్యులు చెప్పారు. కళ్ల కలకలు వస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు. కళ్లను గోరువెచ్చటి కాపడాలు, మెత్తబరిచే కంటి మందు చుక్కులు, మంట నుంచి ఉపశమనం పొందటానికి అనెల్జెసిక్స్ వాడాలని అంటున్నారు. అలాగే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకోవాలని, మత్తని, చెమ్మగా ఉన్న టవల్‌తో కంటి స్రావాన్ని సున్నితంగా శుభ్రపర్చుకోవాలని సూచించారు. యాంటి బయాటిక్స్, స్టెరాయిడ్స్ అసలు వాడొద్దని వైద్యులు తెలిపారు.


Advertisement

Next Story

Most Viewed