Kadapa: సీఎం జగన్, లక్ష్మీపార్వతిపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-05-20 13:17:41.0  )
Kadapa: సీఎం జగన్, లక్ష్మీపార్వతిపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సర్వనాశనం అయిన ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిందేనని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కడపలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి, మినీ మహానాడు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ ఆనాడు లక్ష్మీపార్వతి నుంచి పార్టీని కాపాడుకోకపోయి ఉంటే ఈనాడు ఎన్టీఆర్ శత జయంతి ఉండేది కాదన్నారు. ప్రపంచ దేశాల్లో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించడం తెలుగు ప్రజలు గర్వించదగ్గ విషయమన్నారు. నెల్లూరులో సారా నిషేధానికి అఖిలపక్షంతో కలిసి పోరాటం చేస్తే ఎన్టీఆర్ వచ్చి తనను అభినందించి నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మధ్య నిషేధం చేశారని సోమిరెడ్డి గుర్తు చేశారు.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే దశలవారీగా మధ్య నిషేధం చేశారా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. రైతు సంక్షేమం కోసం ఉచిత విద్యుత్తును అందించిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. 12 గంటలు విద్యుత్ అందిస్తానన్న జగన్ ఒక గంట కూడా సక్రమంగా అందివ్వలేదని విమర్శించారు. టీడీపీ హయాంలో వర్షాలు పడకపోయినా అనంత, కడప, చిత్తూరు ఉద్యాన పంటలకు ట్యాంకర్లతో నీరు ఇచ్చి రైతులను ఆదుకొన్నామన్నారు.

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ బినామీగా ఒక్కో ట్రాన్స్‌ఫార్మర్‌ను రూ.4 లక్షల 8 వేలకు బిల్లులు చెల్లింపు చేసుకుంటున్నారని ఆరోపించారు. విశాఖ, విజయవాడ కంపెనీలకు 78 వేల కోట్లు ప్రభుత్వం బాకీ ఉందని తెలిపారు. ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసుకున్నందుకు ఐదు రూపాయల 80 పైసలు అదానీకి చెల్లిస్తున్నామని సోమిరెడ్డి వ్యాఖ్యనించారు.

Also Read..

స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన రూ. 4 వేల కోట్లు సిద్దం: డా .కె.ఏ.పాల్

Advertisement

Next Story