పోస్టాఫీసులో గోల్‌మాల్ .. రూ. కోటి కొట్టేసిన పోస్ట్‌మాస్టర్

by srinivas |   ( Updated:2024-01-20 14:55:20.0  )
పోస్టాఫీసులో గోల్‌మాల్ .. రూ. కోటి కొట్టేసిన పోస్ట్‌మాస్టర్
X

దిశ, వెబ్ డెస్క్: ఆమె పోస్టు చిన్నది.. కాని కొట్టేసింది. రూ. కోటి. చిన్నాల మొత్తాల పొదుపు పోస్టాఫీసులో సాధ్యమని అని చెబుతారు. కష్టపడి సంపాదించిన డబ్బులో కొంత పొదుపు చేయండని అంటారు. తీరా డబ్బు దాచుకుంటే కొట్టేశారు. ఇది కడప జిల్లా పందిర్లపల్లె పోస్టాఫీస్‌లో జరిగిన ఉధంతమిది. పందిర్లపల్లె పోస్టాఫీసులో చాలా మంది ప్రజలు డబ్బులు డిపాజిట్ చేశారు. ఈ డబ్బులకు వడ్డీ వస్తుందని ఆశించారు. అయితే ఇక్కడ పని చేసే పో‌స్ట్‌‌మాస్టర్ ఉమా మహేశ్వరి పోస్ట్ బాక్సు ఉత్తరాలను పోస్ట్‌మేన్ ద్వారా ఇంటింటికి పంపించాల్సింది పోయి, ఖాతాదారులు దాచుకున్న డబ్బులను తన ఇంటికి పంపుకున్నారు. ఇలా పోస్ట్ మాస్టర్ ఉమా మహేశ్వరి రూ.కోటి కొట్టేశారు. ఖాతాల్లో డబ్బులు లేకపోవడంతో ఖాతాదారులు ఆందోళకు దిగారు. డబ్బులు కొట్టేసిన ఉమా మహేశ్వరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. పోస్ట్ మాస్టర్‌పై చర్యలు సిద్ధమవుతున్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story