సీఎం జగన్ అడ్డాలో కాంగ్రెస్ దూకుడు.. 12 సార్లు విజయకేతనం

by srinivas |   ( Updated:2023-06-22 13:57:27.0  )
సీఎం జగన్ అడ్డాలో కాంగ్రెస్ దూకుడు.. 12 సార్లు విజయకేతనం
X

దిశ,కడప: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, పులివెందుల గడ్డపై మరోసారి కాంగ్రెస్ జెండా వేస్తామని ఆ పార్టీ రాష్ట్ర మీడియా విభాగం చైర్మన్ తులసి రెడ్డి పేర్కొన్నారు. పులివెందుల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అన్నారు. 1955 నుంచి 2019 వరకు మొత్తం 16 సార్లు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 12సార్లు విజయం సాధించిందన్నారు. పులివెందుల నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎక్కువ శాతం అభివృద్ధి జరిగిందన్నారు. జేఎన్టీయూ కళాశాల, భూగర్భ డ్రైనేజీ,రింగ్ రోడ్డు,అన్ని గ్రామాలలో సిమెంట్ రోడ్లు, శిల్పారామం, పులివెందుల -కడప ప్రధాన రహదారిలో నాలుగు లెన్ల రహదారి, పైడిపాలెం రిజర్వాయర్ ప్రాజెక్టు, లింగాల కెనాల్, పిబిసి ఆధునికీకరణ, చిత్రావతి సామర్థ్యం పెంపు, గండికోట ఎత్తిపోతల, అంతర్జాతీయ పశు పరిశోధన కేంద్రం, త్రిబుల్ ఐటీ, ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పాలనలోనే జరిగాయన్నారు.


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు సూత్రాల కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. ఇందులో ఆరు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ, 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా, ప్రతి నిరుపేద కుటుంబానికి నెలకు 6000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం, సంజీవని వంటి ప్రత్యేక హోదా అమలు, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహాలో అభివృద్ధి ప్యాకేజీ, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు మరిన్ని యువజన సమస్యల పరిష్కారం లభించేలా కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఎలాంటి షరతులు లేకుండా 100 శాతం రాయితీపై డ్రిప్ ఇరిగేషన్ అమలు చేస్తామన్నారు. మీడియా సమావేశంలో పులివెందుల అసెంబ్లీ సమన్వయ కమిటీ సభ్యులు తిరుపాల్ రెడ్డి, శ్రీకాంత్, మహేంద్ర, నరసింహారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :: Kala Venkatraao: వైఎస్ జగన్‌కు ఎన్నికలంటే భయం

Advertisement

Next Story