అమరావతిలో వైఎస్ జగన్‌కు తిరిగే పరిస్థితి లేదు : Devineni Uma Maheswara Rao

by Seetharam |   ( Updated:2023-07-24 11:59:10.0  )
అమరావతిలో వైఎస్ జగన్‌కు తిరిగే పరిస్థితి లేదు : Devineni Uma Maheswara Rao
X

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతి పర్యటనపై మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ అమరావతి ప్రాంతంలో తిరిగే పరిస్థితి లేదని చెప్పుకొచ్చారు. తాడేపల్లి నుంచి వెంకటాయపాలెంకు మధ్య దూరం 6 కిలోమీటర్లే అయినప్పటికీ హెలికాప్టర్‌లో వెళ్లాడంటే..వైఎస్ జగన్‌కు ఎంత భయం ఉందో అర్థమవుతుందని విమర్శించారు. ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని నినాదంతో అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్ చేపట్టిన పాదయాత్రకు దేవినేని ఉమా మహేశ్వరరావు మద్దతు పలికారు. శ్రీనివాస్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ... వైఎస్ జగన్ పులివెందుల పులి కాదని తాడేపల్లి పిలి అని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులు.. రోడ్డెక్కి పోరాటాలు చేయాల్సి దుస్థితి రావడం బాధాకరమని అన్నారు. న్యాయం కోసం రోడ్డెక్కిన మహిళలు, దళితులపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం దుర్మార్గమని అన్నారు. వైఎస్ జగన్ ఒక సైకో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సైకో చేతిలో రాష్ట్రం విలవిల్లాడుతోందని దేవినేని ఉమా చెప్పుకొచ్చారు. వివేకా హత్య కేసు ఓ కొలిక్కి వస్తుందని చెప్పుకొచ్చారు. దీంతో వైఎస్ జగన్ కుటుంబంలో వణుకు మెుదలైందని చెప్పుకొచ్చారు. సీబీఐ చార్జిషీట్ వివరాలు బయటకు రావడంతో తాడేపల్లి ప్యాలెస్‌లో భయాందోళనలు మెుదలైనట్లు మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed