Viveka Case: వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

by srinivas |   ( Updated:2023-05-26 15:03:21.0  )
Viveka Case: వైఎస్ భాస్కర్ రెడ్డికి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వివేకానందారెడ్డి హత్య కేసులో ఆయన రిమాండ్‌లో భాగంగా చంచల్ గూడ జైలులో ఉన్నారు. జైల్లోనే అస్వస్థతకు గురి కావడంతో ఉస్మానియాకు తరలించారు. బీపీ పెరిగిందని, నిమ్స్‌కు తీసుకెళ్లాలని ఉస్మానియా వైద్యులు తెలిపారు. దీంతో నిమ్స్‌లో చికిత్స చేశారు. అనంతరం చంచల్ గూడ జైలుకు తరలించారు.

మరో వైపు వివేకానందారెడ్డి హత్య కేసు విచారణ హైకోర్టులో సాగుతోంది. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వైఎస్ అవినాశ్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరువర్గాల వాదనలను ధర్మసనం వింటోంది. అవినాశ్ రెడ్డి తరపు లాయర్లకు, వైఎస్ సునీత మధ్య న్యాయవాదులకు వాదోపవాదనలు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి హైదరాబాద్ తరలింపు

Viveka Case: వైఎస్ సునీతపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.. సీరియస్ వార్నింగ్

వైఎస్ వివేకా హత్యకేసులో ట్విస్ట్.. ఎర్ర గంగిరెడ్డికి సుప్రీం కోర్టు షాక్

Next Story

Most Viewed