దొంగ ఓట్లతో లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ : బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి

by Shiva |   ( Updated:2024-01-24 09:59:58.0  )
దొంగ ఓట్లతో లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ : బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో అధికారులతో కుమ్మక్కై అధికార వైసీపీ భారీ ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేయించిందని, ఇప్పుడు అవే సీఎం జగన్ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. ఇవాళ విజయవాడలో నిర్వహించిన ‘గావ్ చలో అభియాన్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె‌లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ‘వైనాట్‌ 175’ వెనుక పెద్ద స్కెచ్ దాగి ఉందని ధ్వజమెత్తారు. ఓటర్ల నమోదు ఎన్నడూ లేని విధంగా వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఊరు, పేరు లేని వ్యక్తుల పేరిట దొంగ ఓట్లను నమోదు చేయించి ఓటరు ఐడీలను కూడా తీసుకున్నారని ఆరోపించారు.

ఇక తిరుపతి ఉప ఎన్నికలో 35 వేల దొంగ ఓట్లు వేయించారని, మరోసారి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో విజయం సాధించాలని జగన్ ఆరాటపడుతున్నారని పేర్కొ్న్నారు. దొంగ ఓట్ల విషయంలో ప్రజలకు అసలు విషయాలు బహిర్గతం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పలు జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు మంజూరు చేసిందని, తమ ప్రభుత్వ సహకారం లేకుండా చేసిన పనులు ఒక్కటి కూడా లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తన పార్టీ అధిష్టాన నిర్ణయిస్తుందని పురందేశ్వరి స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed