- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందకృష్ణ వర్సెస్ పవన్ ఫ్యాన్స్: విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu)ను ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(MRPS founder president Mandakrishna Madiga ) బుధవారం కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anita)ను ఉద్దేశించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) మాట్లాడిన వ్యాఖ్యలపై స్పందించారు. హోంమంత్రిపై పవన్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. పవన్ అభిప్రాయం ఎలా ఉన్నా లోపల మాట్లాడాలని సూచించారు. దళిత మంత్రిపై అలా మాట్లాడటం సరికాదన్నారు. హోంమంత్రిని అంటే సీఎంను, ప్రభుత్వాన్ని అన్నట్టేనని చెప్పారు. కేబినెట్ అంటే కుటుంబమని, పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికి నష్టమని, తమ కులానికి అవమానమని మందకృష్ణ మాదిగ అన్నారు.
మందకృష్ణ మాదిగ చేసిన ఈ వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(YCP MP Vijayasai Reddy) ట్విట్టర్ ద్వారా స్పందించారు. చంద్రబాబు మాట్లాడిన తరువాత మందకృష్ణ మాదిగ పవన్ కల్యాణ్‌ను తిట్టారని ఆరోపించారు. సీఎంను కలిసిన తర్వాత ఎందుకు పవన్‌ని మందకృష్ణ తిట్టారన్న సందేహం పవన్ కళ్యాణ్ అభిమానులకు రాలేదంటారా అని ప్రశ్నించారు. కృష్ణ మాదిగను పవన్ అభిమానులు తిడుతున్నారు కాని ఆయనతో పవన్‌ను తిట్టించిన చంద్రబాబును ఒక్క మాట కూడా అనడంలేదని వ్యాఖ్యానించారు. అదే చంద్రబాబు మార్క్ రాజకీయం అని ట్వీట్‌లో విజయసాయిరెడ్డి తెలిపారు.
చంద్రబాబుని కలిసి ఆయనతో ఓక్క గంట మాట్లాడిన తరువాత బయటికి వచ్చి కృష్ణ మాదిగ పవన్ కళ్యాణ్ ను తిట్టారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 6, 2024
బాబుని కలిసిన తర్వాత ఎందుకు పవన్ ని తిట్టాడు అన్న సందేహం రాలేదంటారా పవన్ కళ్యాణ్ అభిమానులకు?
కృష్ణ మాదిగని తిడుతున్నారు కాని కృష్ణ మాదిగ చేత పవన్ కళ్యాణ్ ని తిట్టించిన చంద్రబాబు…