- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంత ఖర్మ నాకు పట్టలేదు.. బీజేపీలో చేరికపై ఎంపీ మిథున్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరం ఓడిపోయింది. 175 అసెంబ్లీ స్థానిల్లో పోటీ చేసిన ఆ పార్టీ 164 చోట్ల ఓటమి పాలయ్యారు. 25 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులు నలుగురే గెలిచారు. దీంతో ముగ్గురు ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారని, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కమలం నేతలతో టచ్‌లో ఉన్నారని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు. దీంతో స్పందించిన మిథున్ రెడ్డి.. తనకు బీజేపీలో చేరాల్సిన ఖర్మ పట్టలేదన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను సొంత తమ్ముడిలా చూసుకుంటున్నప్పుడు వేరే పార్టీ వైపు చూడాల్సిన అవసరం ఏముందన్నారు. తాను బీజేపీలో చేరాతానని ప్రతిపక్ష నాయకులు మైండ్ గేమ్ ఆగుతున్నారని, ఎవరూ నమ్మవద్దని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం బిల్లులు పెడితే ఎన్డీయే కూటమికి మద్దతు తెలుపుతామని వెల్లడించారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉంటే కచ్చితంగా సపోర్ట్ చేయమని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు.