- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుది వేటగాడి మనస్తత్వం.. పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: చంద్రబాబుది వేటగాడి మనస్తత్వమని వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని వ్యాఖ్యానించారు. మత్య్సకారులను, బోయలను ఎస్టీల్లో చేస్తామని అప్పుడు చంద్రబాబు చెప్పారని.. ఆ హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిలుపుదలకు కుట్ర చేసిందని చంద్రబాబు కాదా అని నిలదీశారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఎవరో తెలియదా అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చరిత్ర రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసని ఎద్దేవా చేశారు. పేదలు, వితంతువులకు ఇంటికి వెళ్లి పింఛన్లు అందించాలనే ఆలోచన ఎప్పుడైనా చేశారా పేర్ని నాని ప్రశ్నించారు.
ఎన్నికల ఆంక్షల పేరుతో వృద్ధులు, పింఛన్‌దారులకు నగదు పంపిణీ చేయకుండా ఆపిందెవరని పేర్ని నాని మండిపడ్డారు. పెన్షన్లు ఆపడం ఎవరి తరం కాదని పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు. వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు పెట్టగానే టీడీపీ నేతలు సంబురాలు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లపై దుష్ప్రచారం చేస్తున్నారని, వాళ్లను పెగాసస్‌తో పోల్చింది టీడీపీ నేతలు కాదా అని పేర్ని నాని ప్రశ్నించారు. వాలంటీర్లను కొనసాగిస్తానని చంద్రబాబు చెబుతున్నారని.. అది నోరా.. లేక తాటిమట్టా అని సెటైర్లు వేశారు. బీజేపీతో దోస్తీ.. కుస్తీ వ్యవహారమేంటన్నారు. జన్మభూమి కమిటీలు సమాజానికి చేటు చేశాయని, అందుకే వాటిని బంగాళాఖాతంలో కలిపామని పేర్ని నాని చెప్పారు.