AP Political News: ఆపని చేస్తూ పట్టుబడిన వైసీపీ నేతలు..

by Indraja |   ( Updated:2024-03-22 08:30:01.0  )
AP Political News: ఆపని చేస్తూ పట్టుబడిన వైసీపీ నేతలు..
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఎన్నికల అధికారులు ఎన్నికల కోడ్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన వారిపై ఉక్కు పాదం మోపుతున్నా ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ మాత్రం ఎన్నికల కోడ్ నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తోంది. తాజాగా విశాఖపట్నం లోని చోడవరంలో ఓటర్లకు చీరలు పంచుతూ ఫ్లైయింగ్ స్క్వాడ్ కు వైసీపీ నాయకులు అడ్డంగా దొరికారు.

వివరాల్లోకి వెళ్తే వైసీపీ జడ్పీటీసీ భర్త శ్రీకాంత్ తన అర్ధాంగి అభివృద్ధి కోసం అధిష్టానం మాటలను తూచాతప్పకుండా పాటిస్తున్నారు అనడానికి విశాఖపట్నం లోని చోడవరంలో ఓటర్లకు చీరలు పంచుతూ పట్టుబడమే నిదర్శనం అంటున్నారు స్థానికులు. ఇక శ్రీకాంత్ చీరలు పంచుతుండగా ఫ్లైయింగ్ స్క్వాడ్ కు చిక్కారు. అనంతరం శ్రీకాంత్ కార్ లో ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు చెయ్యగా చీరలు లభ్యమయ్యాయి.




స్వయాన చోడవరం ఎమ్మెల్యే ధర్మ శ్రీ భార్య తోపాటు పలువురు వైసీపీ ఎంపీటీసీలు,వార్డ్ మెంబర్లతో పంపిణీ కార్యక్రమం చేపట్టగా అధికారుల బ్రేకులు వేశారు. స్వయాన ఎమ్మెల్యే ధర్మ శ్రీ భార్య కూడా ఘటనా స్థలంలో ఉండటంతో అధికారులు ఆవిడ పేరును తప్పించడానికి ప్రయత్ని స్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Read More..

Breaking News: నాయకులా.. ? రౌడీలా..? జనసేన నేతలపై వైసీపీ నాయకుల దాడి..

Advertisement

Next Story