- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రం నుంచి పారిపోవాల్సిన ఖర్మ నాకు పట్టలేదు: దేవినేని అవినాశ్
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రం నుంచి పారిపోవాల్సిన ఖర్మ తనకు పట్టలేదని వైసీపీ నేత దేవినాని అవినాశ్ తెలిపారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దుబాయ్ వెళ్తున్న ఆయనను గురువారం రాత్రి పోలీసులు అడ్డుకోవడంతో పారిపోయేందుకు ప్రయత్నం చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై దేవినేని అవినాశ్ స్పందించారు. తాను దుబాయ్ పారిపోయేందుకు ప్రయత్నం చేయలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం నుంచి వెళ్లిపోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. రెండు నెలలుగా విజయవాడ వైసీపీ కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉన్నానని దేవినేని అవినాశ్ తెలిపారు.
‘‘మేము ఎందుకు పారిపోవాలి. మేం తప్పు చేశామని కోర్టు శిక్ష విధిస్తే స్వీకరిస్తాం. అక్రమ కేసులకు భయపడి పరిపోవాల్సిన అవసరం మాకు లేదు. 2019లో చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఆందోళన నిర్వహించాం. చలో ఆత్మకూరు సమయంలోనూ తాను పారిపోలేదని, దమ్ముగా అక్కడి వెళ్లానని తెలిపారు. ధైర్యంగా ఉండటం నా తండ్రి దేవినేని నెహ్రూ నేర్పారు. వైసీపీ కార్యకర్తలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా 24 గంటలు అందుబాటులో ఉంటాం. అండగా ఉంటాం. పార్టీ కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్తాం.’’ అని వైసీపీ నేత దేవినేని అవినాశ్ పేర్కొన్నారు.