ఆ ప్రాంతం నుంచి జనసేనలో భారీగా చేరికలు.. చాలా సంతోషంగా ఉందన్న పవన్ కల్యాణ్

by Gantepaka Srikanth |
ఆ ప్రాంతం నుంచి జనసేనలో భారీగా చేరికలు.. చాలా సంతోషంగా ఉందన్న పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కీలక నేతలు, కార్పొరేటర్లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మంగళవారం జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. వారికి పవన్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తనకు ఎంతో ఇష్టమైన విశాఖలో చేరికలు మొదలవ్వడం సంతోషంగా ఉందని అన్నారు. వైసీపీ తనకు వ్యక్తిగతంగా శత్రువు కాదని చెప్పారు. అందరం కలిసిగట్టుగా రాష్ట్ర, పార్టీ అభివృద్ధికి పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలో విశాఖలో పర్యావరణ ఆడిట్ ఉంటుందని అన్నారు. విశాఖ రియల్ ఎస్టేట్ సమస్యలపై కలిసిగట్టుగా పోరాటం చేస్తామని తెలిపారు. మరోవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం క్యాంప్ రాజకీయాలకు కూడా కూటమి నేతలు సిద్ధమయ్యారు. ఎలాగైనా శాసనమండలిలో బొత్సా అడుగు పెట్టకూడదని పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీని ఖాళీ చేసేందుకు చేరికలను ఆహ్వానిస్తున్నారు.

Advertisement

Next Story