- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అల్లు అర్జున్‌ను జైల్లో వేస్తే స్పందించావా? వైసీపీ నేత శిల్పా రవికి నెటిజన్ల నిలదీత

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ఆర్ కడప జిల్లా నల్లమల అటవీప్రాంతంలోని (Kasinayana Ashram) కాశినాయన ఆశ్రమం జ్యోతిక్షేత్రంలోని అన్నదాన సత్రాన్ని ఇటీవల అటవీశాఖ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ప్రతీరోజూ వందలమంది పేదలు, బాటసారులు, యాత్రికుల ఆకలిని తీర్చే అన్నదాన సత్రాన్ని కూల్చివేయడంపై హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేత, అల్లు అర్జున్ ఫ్రెండ్‌గా పాపుల్ అయిన శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి (Silpa Ravi Chandra Kishore Reddy) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై పరోక్షంగా కామెంట్స్ చేశారు. తన ఎక్స్ ఖాతా వేదికగా జస్ట్ ఆస్కింగ్ అంటూ చేసిన పోస్ట్‌పై జనసేన పార్టీ శ్రేణులు, నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు.
‘సనాతన ధర్మాన్ని కాపాడటానికి పుట్టిన నాయకులు కాశిరెడ్డి నాయన ఆశ్రమం కూల్చివేతపై స్పందించరా?’ అంటూ శిల్పా రవి ప్రశ్నించారు. ఈ ట్వీట్‌కు నెటిజన్లు, జనసైనికులు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ‘నీ మిత్రుడు జైల్లో ఉంటే స్పందించావా? సొంత మేనా మామకి అల్లుడికి గొడవ పెట్టి.. ఏం సాదించవ్, మళ్లీ నంద్యాలలో గెలిచే సత్తా ఉందా.. మీ కన్వర్టెడ్ రెడ్డి టైమ్‌లో గుడులు, కన్వర్షన్ ఎక్కువ అయ్యాయి ఏం చేసావ్.. కాశి రెడ్డి మీ కులం అన్నీ మాట్లాడుతున్నావా?’ అని ఓ నెటిజన్ కామెంట్ వైరల్ అవుతోంది. నీ కోసం నంద్యాలకి వచ్చిన (Allu Arjun) అల్లు అర్జున్ జైలు లో వేస్తే నువ్వు స్పందించావా? అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
కాగా, కాశినాయన ఆశ్రమంలో కూల్చివేతలపై ఇటీవల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. జరిగిన సంఘటనకు క్షమాపణలు చెప్పారు. అన్న సత్రాన్ని కూల్చివేయకుండా ఉండాల్సిందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. అదే చోట తన సొంత నిధులతో సత్రాన్ని పునర్నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అలాగే కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.