ఉత్తరాంధ్రలో వైసీపీ గట్టెక్కేనా?

by Mahesh |   ( Updated:2023-04-06 03:20:44.0  )
ఉత్తరాంధ్రలో వైసీపీ గట్టెక్కేనా?
X

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల అభ్యర్థి సీతం రాజు సుధాకర్ ఓటమి పాలవ్వడం అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. ఓటర్లను ఆకట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో అధినేత జగన్ ఆదేశాలు ఉత్తరాంధ్ర నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా నిరుద్యోగ సమస్య, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, రైల్వే జోన్ అంశం, గిరిజన ప్రాంతాల్లో అనాదిగా వస్తున్న అనేక సమస్యలు. వీటన్నిటితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని వైసీపీ నాయకులు స్వార్థానికే వాడుకుంటున్నారనే వాస్తవాల నుంచి ఇక్కడి ప్రజలు బయటపడలేకపోతున్నారు.

దిశ, ఉత్తరాంధ్ర: పథకాలు మళ్లీ గెలిపిస్తాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ధీమా వ్యక్తం చేస్తున్నా, ఉత్తరాంధ్ర ముఖ్య నేతల అడుగులు ముందుకు పడడం లేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు మేలు చేసే ఆలోచన చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. పైగా కీడు తలపెడుతుండటం జీర్ణించుకోలేకపోతున్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు వ్యక్తుల కు ధారాదత్తం చేస్తామంటుంటే వ్యతిరేకించకపోగా అదేమీ పెద్ద సమస్య కాదన్నట్లు ఇక్కడ ఉన్న అధికార వైసీపీ వ్యవహరిస్తుంది.

మేలు చేసిన దాఖలాల్లేవు

కేంద్రంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా గత కాంగ్రెస్ గాని ప్రస్తుత బీజేపీ గానీ ఉత్తరాంధ్రకు చేసిన మేలు ఏమాత్రం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎందరో త్యాగఫలంతో విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకుంటే ప్రైవేటీకరణ పేరుతో తెగ నమ్మేస్తాం అంటూ ముందుకు రావడం ఇక్కడి ప్రజలకు ఎంతో బాధించే విషయం. పాదయాత్రలో చెప్పినట్లుగా నిరుద్యోగులకు ఇచ్చిన భరోసా నేటికీ నెరవేరలేదు.

పథకాలే గెలిపించేస్తాయి గడపగడపకు తిరగండి అంటే నాయకులు యాత్రలు ప్రవాసనంలా సాగిస్తున్నారు. మనస్ఫూర్తిగా గెలుస్తాం అని చెప్పుకోలేనటువంటి పరిస్థితులు నెలకొని ఉండటం ఆ పార్టీ నేతలను నిస్సహాయులను చేస్తుంది. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు చేసి వారిపై ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయాన్ని చెప్పకనే చెప్పారు. వ్యతిరేకంగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలను ఏ అంశంతో వచ్చే ఎన్నికల్లో ఆకట్టుకోవాలని తీవ్ర ఆలోచనలు చేస్తున్నారు.

పట్టించుకోకపోతే జగన్‌కు ముప్పే!

ఎప్పటిలాగే జగన్ ఆలోచనలు అమలులో పెడతారా లేదా సీనియర్ల సూచనలను పాటిస్తారా అనే సందిగ్ధం నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికలను మొత్తం రాష్ట్రంలో పాలనకు ప్రతిపక్షం ముడిపెట్టి చూపడంలో విజయవంతమైంది. మరి కొంతమంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారని మైండ్ గేమ్ ఆడుతున్న చంద్రబాబు వర్గం పాచికలు బాగానే పని చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి మండల స్థాయి నుంచి పార్టీ పటిష్టత కోసం పనిచేసే కార్యకర్తలు గత ప్రభుత్వం నుంచి నిర్మాణాత్మకంగా ఉన్నారు.

కాగా, రాజకీయ పార్టీలతో సంబంధం లేని పత్రికలను సరిగ్గా వినియోగించుకుంటే వైసీపీ గెలుపు సాధ్యమవుతుందనే అభిప్రాయం ఉంది. మనకు వీరితో పని ఏంటని అనుకున్నట్లయితే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీకి అధిష్టానానికి తీవ్రమైన గడ్డుకాలం వచ్చిందనే అనుకోవాలని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more:

పవన్​దారెటు?

Advertisement

Next Story

Most Viewed