అది రాజ్యాంగ విరుద్ధం: Pawan Kalyan

by srinivas |
అది రాజ్యాంగ విరుద్ధం: Pawan Kalyan
X

దిశ, వెబ్ డెస్క్: ఒక్క కులానికే పదవులు కట్టబెడితే అది రాజ్యాంగ విరుద్ధమని పవన్ కల్యాణ్ అన్నారు. భీమవరంలో వారాహి యాత్రలో ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ పై విమర్శలు చేశారు. 8సార్లు కరెంట్ చార్జీలు పెంచారని మండిపడ్డారు. కొత్తగా జే ట్యాక్స్ తీసుకొచ్చారని, ఆక్వాపై టన్నుకు 4 వేలు జే ట్యాక్స్ కట్టాలంట అని సెటైర్లు వేశారు. సంపూర్ణ మద్యపాన నిషేదం సాధ్యం కాదన్నారు. అధికారంలోకి వస్తే పాత ధరలకే మద్యం విక్రయిస్తామన్నారు. మహిళలు వద్దని చెబితే వారి కాలనీల్లో మద్యపానం నిషేధిస్తామన్నారు. అంతేతప్ప పూర్తిగా మద్యపానం నిషేధించలేమని పవన్ పేర్కొన్నారు. ప్రజలకు కూలీగా పని చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు. యువతలోని ప్రతిభ పాఠవాలను బయటకు తీసుకురావాలన్నారు. జనసేన సత్తా అసెంబ్లీలో చూపించాలి. బీసీలకు రాజ్యాధికారం రావాలని ఆకాంక్షించారు. దళితులు తలెత్తుకునే తిరిగేలా ఉండాలన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు అండగా ఉంటానని పవన్ చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed