- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎమ్మెల్సీ ఓటర్లకు వెండి బిస్కెట్లు.. బయటపడ్డ వైసీపీ అభ్యర్థి నిర్వాకం
దిశ, ఉత్తరాంధ్ర: ఐదేళ్లకు ఒకసారి జరిగే ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ఏమాత్రం తీసిపోకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రలోభాలకు ప్రజా ప్రతినిధులు సిద్ధమైపోతున్నారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థి సీతమ్మ రాజు సుధాకర్ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రెడీ అయ్యారు. విశాఖ ఆర్‌కే బీచ్ మెజిస్టిక్ టవర్ 101 ప్లాట్‌లో పెద్ద ఎత్తున వెండి బిస్కట్లను సిద్ధం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పీడీఎఫ్ బృందం అప్రమత్తమయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి, ఎన్నికల అబ్జర్వర్‌కి, పోలీస్ కమిషనర్‌కి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ అభ్యర్థిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పీడీఎఫ్ బృందం డిమాండ్ చేశారు. వెండినాణేలు దాచిపెట్టిన రూమును ఎన్నికల అధికారులు, పోలీసులకు చూపినా స్పందించలేదని విశాఖ 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారాం ఆరోపించారు.
శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు ఫిర్యాదు చేస్తే మహారాణిపేట తహశీల్దార్ 7.30 గంటలకు పోలీస్‌లతో వెళ్లారని బి గంగారం తెలిపారు. కనీసం 101 ప్లాట్‌కు రమ్మన్నా రాకుండా అపార్టుమెంట్ గేటు ముందే ఉండిపోయారని ఆయన ఆరోపించారు. కంప్లైంట్ ఇచ్చిన తమను అపార్ట్‌మెంట్ దగ్గర నుంచి పోలీసులు బలవంతంగా బయటకు పంపించేశారని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని, వెళ్లిపోవాలని తమను పోలీసులు హెచ్చరించారని చెప్పారు. అక్కడ నుంచి వెళ్ళకపోతే అరెస్టులు చేస్తామని బెదిరించారన్నారు. తహశీల్దార్, పోలీసులు గేటు దగ్గరే ఉండి 101 ప్లాట్ లోపలకు కొంతమందిని పంపారని తెలిపారు. ప్లాట్‌లో వేల సంఖ్యలో ఉన్న వెండి ఆభరణలను వేరే ప్రాంతానికి కారులో తరలించి అధికార పార్టీ అభ్యర్థికి సహకరించారని ఆరోపించారు.
గతంలో ఏయూ వీసీ ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో సమావేశం పెట్టి దొరికిపోయినా.. ఆయనపై ఎటువంటి చర్యలు లేవన్నారు. ఇప్పుడు ఏకంగా వెండి, డబ్బులు పంపిణీకి సిద్ధమవడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అన్నారు. పట్టభద్రులందరూ వైసీపీ అక్రమాల తాయలాలను, డబ్బు పంపిణీని తిరస్కరించాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పీడీఎఫ్ అభ్యర్ధి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ కోరారు.