Hero Nani: కుటుంబ సమేతంగా చూసే సినిమా ‘దసరా’

by srinivas |   ( Updated:2023-03-19 14:51:43.0  )
Hero Nani: కుటుంబ సమేతంగా చూసే సినిమా ‘దసరా’
X

దిశ, ఉత్తరాంధ్ర: ‘దసరా’ సినిమా కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా అని హీరో నాని అన్నారు. ‘దసరా’ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా విశాఖ నోవాటెల్ హోటల్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడారు. హీరోయిన్ కీర్తి సురేష్‌తో తాను ‘నేను లోకల్’ సినిమా చేశానని, ఆ తర్వాత చేసిన రెండో చిత్రం ‘దసరా’ అని తెలిపారు.

ఈ నెల 30న ‘దసరా’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుందని నాని చెప్పారు. పుష్ప, కేజీఎఫ్-2 మాదిరిగానే ‘దసరా’ సినిమా గురించి ఈ నెల 30 నుంచి ప్రేక్షకులు మాట్లాడతారని పేర్కొన్నారు. ఈ సినిమాలో అంతబలమైన, నమ్మకమైన కంటెంట్ ఉందని నాని చెప్పారు. దర్శకుడు శ్రీకాంత్ సినిమాను బాగా తీశారన్నారు. పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. సంతోష్ నారాయణ మంచి సంగీతం అందించారన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని హీరో నాని తెలిపారు.

Advertisement

Next Story