- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖలో ఐపీఎల్... ఏర్పాట్లు పూర్తి
దిశ ప్రతినిధి, విశాఖపట్న: విశాఖలో ఐపీల్ పోటీలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి,. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణకు సంబంధించి బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. విశాఖ క్రికెట్ స్టేడియంలో 31న ఢిల్లీ క్యాపిటల్స్ – చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్– కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా శుక్రవారం స్టేడియంలో చేపట్టిన వివిధ పనులను పరిశీలించారు.
అనంతరం ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా పోలీసు అధికారుల సహకారంతో అన్ని చర్యలు తీసుకున్నాం. ఏసీఏ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి నాయకత్వలో నాలుగేళ్లలో మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో అద్భుత విజయాలు సాధించడం వల్లే విశాఖకు ఐపీఎల్ మ్యాచ్‌లను కేటాయించారని పేర్కొన్నారు. విశాఖ ప్రత్యేకమైన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ల ద్వారా ఇమిడింప చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బీసీసీఐ ర్యాంకింగ్స్ నివేదికలో ఇక్కడ మ్యాచులు ఆడిన క్రికెటర్లు ఇచ్చిన నివేదిక ప్రకారం బీసీసీఐ ఏసీఏకు అవకాశాలు ఇస్తుందని పేర్కొన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో అన్ని రకాల వసతులు క్రీడాకారులకు మ్యాచ్ నిర్వహణ సిబ్బందికి అందించడంలో మంచి ప్రశంసలు అందాయని ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి పేర్కొన్నారు.