AP News: ఎవరైనా చేరవచ్చు..YSRCP ఓపెన్ ఆఫర్

by srinivas |   ( Updated:2022-11-26 11:08:48.0  )
AP News: ఎవరైనా చేరవచ్చు..YSRCP ఓపెన్ ఆఫర్
X

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు చేరినా స్వాగతిస్తామని విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల వైసీపీ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. అయితే చేరికల వల్ల పార్టీకి ఎంతమేర ప్రయోజనం కలుగుతుందో అన్నదానిపై అధిష్టానం ఆలోచిస్తుందని ఆయన చెప్పారు. వైసీపీలో చేరేందుకు మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు రంగం సిద్ధం చేసుకుంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయని.. ఇలాంటి తరుణంలో వైవీ సుబ్బారెడ్డి ఇలాంటి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.

విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు అనేవి నిరంతర ప్రక్రియ అని చెప్పారు. ఎవరైనా చేరవచ్చని కుండ బద్దలు కొట్టేశారు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని.. వైసీపీకి చెందిన నేతలతో మంతనాలు జరిపారంటూ వార్తలు వస్తున్నాయన్నారు. 'ఎవరిని ఎప్పుడు పార్టీలో చేర్చుకోవాలి వారిని ఎంతమేరకు ఉపయోగించుకోవాలి..వారి వల్ల పార్టీకి ప్రజలకు ఎంత మేర లబ్ధి చేకూరుతుంది అనేది పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది.' అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.


పదవులు మారిస్తే తక్కువ చేసినట్లు కాదు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత మార్పులు, పదవుల తొలగింపు వంటి అంశాలపైనా విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పదవులు మార్చినంత మాత్రాన ఎవరినీ తక్కువ చేసినట్లు కాదని చెప్పుకొచ్చారు. నాయకుల అవసరం బట్టి వారిని మరో చోట వినియోగించుకోవాలనేదే పార్టీ ఆలోచన తప్ప మరే ఉద్దేశం లేదని అన్నారు. అంతేకాదు నారా లోకేశ్ పాదయాత్రపైనా సెటైర్లు వేశారు. పాదయాత్రలు ఎవరైనా చేయవచ్చని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేసిందని దాదాపు 95 శాతం హామీలను అమలు చేసినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Read more:

Cm Jagan కీలక నిర్ణయం.. 11 వేల మంది ఉద్యోగులకు ఫుల్ హ్యాపీ

Advertisement

Next Story