- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Andhra పాలనను ఆదర్శంగా తీసుకుంటున్న కేరళ, పంజాబ్
శ, జి.మాడుగుల: కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ జగనన్న ప్రభుత్వంలోనే లబ్ధి చేకూరిందని ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు అన్నారు. అందరి పక్షాన నిలిచే ప్రభుత్వానికి అండగా ఉండాలని పిలుపునిచ్చారు. పాడేరు శాసనసభ్యుడు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జి.మాడుగుల మండలం ఏపీ ఆర్‌ఎస్ స్కూలు టీచర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గిరిజన పక్షాన ప్రభుత్వం నిలుస్తుందని, ప్రతి సమస్యను పరిష్కారానికి నిరంతరం ప్రయత్నిస్తుందని చెప్పారు. మంచి చేసే వ్యక్తులు ఆదరిస్తేనే భవిష్యత్తులో మంచి అనేది జరుగుతుందని పేర్కొన్నారు.
ఇంతకుముందు ఎన్నడూ జరగని మేలు కేవలం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే జరగడం శుభ పరిణామమని తెలిపారు. అందుకే పార్టీలు, కులాలు, మతాలు అన్నింటికీ అతీతంగా జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రమంతటా ప్రశంసలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పాలనను ఆదర్శంగా తీసుకునే ప్రయత్నం జరుగుతుందని, ఇప్పటికే కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాలు ఏపీ రాష్ట్ర పాలన నమూనాగా స్వీకరించేందుకు సర్వేలు కూడా పూర్తి చేసుకున్నాయని రవి బాబు పేర్కొన్నారు.